Hope Outreach & Living Hope


సజీవ నీరీక్షణ దైవ సందేశములు
Click on Play button to listen

 
 
Total visitors : 1021
Total views, this Message : 15

#22 రోమీయులకు 2 :

రోమీయులకు సందేశము 2 - మన ఉమ్మడి విశ్వాసం

మానవ జాతిగా మనకు చాలా సంగతులు సాధారణమే, ఒక్కటే. మనమంతా ఉమ్మడిగా ఎదుర్కొనేవి పుట్టుక, జీవితం, మరణం. ఇవన్నీ సాధారణమే, అంటే, మనమందరము వాటిని అనుభవిస్తాం. ఉమ్మడి అనుభవం అని దీన్ని అంటూ ఉన్నాం.
కొన్ని భిన్నమైనవి కూడా ఉన్నవి. మనమంతా ఒకే విధంగా కనిపించము. మనము వేరు వేరు సంస్కృతులలో జీవించవచ్చు. కానీ మనలో చాలా సాధారణమైనవి కూడా ఉన్నవి.
దేవుడు మనలను ప్రేమించినపుడు మనందరికీ పరస్పర అవసరాలు ఉంటాయని ఆయనకు తెలుసు అన్నవిషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన అవసరం ఒక్కటే గనుక దేవుడు ఒక్కడే రక్షకుణ్ణి ఏర్పాటు చేసిఉన్నాడు. మీరూ నేను, క్రీస్తునందు విశ్వాసముంచినపుడు, మన విశ్వాసము పరస్పరo, ఉమ్మడి విశ్వాసము అవుతున్నది. అలాగే ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా! క్రైస్తవులందరి విశ్వాసము ఉమ్మడి విశ్వాసము. మన విశ్వాసము ఒక్కటే.
రోమీయులకు 1:8-13 లో ఆపో. పౌలు బోధించిన విషయం మన పరస్పర విశ్వాసము . ఇవి దేవుని మాటలు, జాగ్రత్తగా గమనిద్దాం :

8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
9. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,
10. మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.
11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని
12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.
13. సహో దరురులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు.

గమనించండి, ఈ వచనాల ఆధారంగా మన పరస్పర విశ్వాసమునకుగల ప్రత్యక్ష రుజువులను కొన్నింటిని మీ ముందు ఉంచుతూ ఉన్నాను.

మన ప పరస్పర విశ్వాసము సాక్ష్యము ద్వారా తెలుస్తున్నది: వారి విశ్వాసము సర్వ లోకములో తెలియవచ్చిందని, ఋజువయ్యిందని ఆపో. పౌలు గారు చెప్పిఉన్నారు. 8వ వచనం గమనించండి. “మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుచుండుటచూచి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” ఇతరులు మన విశ్వాసమును గమనించి చూస్తారు. రోమ్ లోని ఈ క్రైస్తవుల విశ్వాసమును గూర్చి అన్నిచోట్ల ఉన్న వారు గొప్ప సాక్ష్యము చెప్పి ఉండాలి. వారి విశ్వాసము దాచబడలేక పోయింది. అది తేటగా కనిపించింది.

ఇంకా చూస్తే అది వ్యక్తిగతమైనది. మీ విశ్వాసము అప్పుగా తీసుకోలేనటువంటిదని ఆయన అంటున్నారు. ఒక షర్ట్ లేదా టవల్ అప్పు తీసు కున్నట్టు విశ్వాసమును అప్పుగా తీసుకోలేము. కొంత డబ్బు లేదా ఒక పనిముట్టు అప్పు తీసుకున్నట్టు విశ్వాసమును అప్పు తీసుకోలేము. లేదు, అది అది వ్యక్తిగతమైన విశ్వాసము. అది నీదే అవుతుంది. విశ్వాసము నీది కానట్లయితే నీవెన్నడూ పొందలేవు, అంతే.

ఆ తరువాత అపొస్తలుడు ఇంకా మాట్లాడుతూ ఆయన తన దేవుణ్ణి ఆత్మలో సేవిస్తున్నానని చెబుతున్నాడు. అది 9 వ వచనంలో కనిపిస్తున్నది. “ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.” అవును, దేవుణ్ణి సేవిస్తున్న ప్రతి ఒక్కరి గూర్చి ఆయనకు బాగా తెలుసు. ఆపో. పౌలు నాకిది తెలుసు అని చెప్పగలిగాడు. నేను ఆత్మలో దేవుణ్ణి సేవిస్తున్నానానడానికి ఆయనే నాకు సాక్షి.

కాబట్టి క్రైస్తవులుగా మన విశ్వాసమును మనము మన సాక్ష్యము ద్వారా తెలియపరుస్తాం. మన పరస్పర విశ్వాసము మన సాక్ష్యము ద్వారా బహిర్గతం అవుతుంది. ఈ రోమీయులకు చాలా కీర్తి ఉన్నది. వారు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారు. వారున్న ప్రతి చోట వారి విశ్వాసము గూర్చి తెలిసింది. వారి సాక్ష్యం వారి విశ్వాసమును రుజువు చేసింది, దానికి సాక్ష్యాధారాలు చూపించింది.

మన పరస్పర విశ్వాసము ప్రార్ధన ద్వారా తెలుస్తున్నది. వారు ఒకరికోసం మరొకరు ప్రార్ధన చేస్తున్నారు. వారిని తన ప్రార్ధనలలో జ్ఞాపకం చేయడం ఎప్పుడూ మానలేదని ఆపో. పౌలు గారు చెబుతున్నారు. 9 వ వచనం చూశారా? “నా ప్రార్ధనల యందు ఎల్లప్పుడు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను.” అని ఆయన చెప్పడం గమనించాలి. ఆపో. పౌలు ప్రత్యేకించి వారికోసం ప్రార్ధనచేశాడని నేను నమ్ముతున్నాను. తన సహోదర సహోదరిలైన రోమ్ విశ్వాసులకోసం ఆయన ప్రత్యేకమైన వాటికోసం, ఖచ్చితమైన వాటి కోసం ప్రార్ధించి ఉండాలి. ఆయన వాళ్ళ కోసం ప్రార్ధించాడు.

ఆయన వారి వ్యక్తిగతమైన అవసరతల కోసం, అలాగే తన అవసరాల కోసం ప్రార్ధిస్తూ ఉన్నాడు. ఆయన 10 వ వచనంలో ఏ విధంగా నైన, మీ వద్దకు వచ్చి మిమ్ములను చూడడానికి రావాలని ఆశపడుతున్నాని చెప్పాడు. మీ దగ్గరికి వచ్చి మిమ్ములను చూడడానికి మంచి ప్రయాణము దేవుని చిత్తానుసారముగా కలగాలని ఆశపడుతున్నానని తేటగా చెబుతున్నాడు.

పౌలు ప్రార్ధనలోని ఒక సంగతి మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఆయన దేవుని చిత్తానుసారంగా ప్రార్ధిస్తున్నాడు. మిత్రమా, ఇది చాలా ప్రాముఖ్య మైనది. విశ్వాసం, పరస్పర విశ్వాసం, ప్రార్ధన ద్వారా తెలియ పర్చబడింది. కానీ పరస్పర విశ్వాసం దేవుని చిత్తానుసారమైన ప్రార్ధన ద్వారా బయలుపడింది. ఇది ఎంత ప్రాముఖ్యమో గమనిస్తున్నారా ? దేవుని చిత్తానుసారంగా మంచి ప్రయాణం తనకు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తిగత అవసరం గురించి పార్ధిస్తున్నాడు, కానీ ఒక వ్యక్తిగత అవసరత కోసం దేవుని చిత్తం అనుగుణంగా ప్రార్ధిస్తున్నాడు.

క్రైస్తవులుగా మనం ఒకరి కోసం మరొకరు ప్రార్ధించవచ్చు. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నపుడు నా కోసం మీరు ప్రార్ధిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఆపో. పౌలు అలాంటి మనవి చేసినట్టు, నేను కూడా ఈ మనవి చేస్తున్నాను. మీరు నా కోసం ప్రార్ధించాలని కోరుతున్నాను, నేను మీ కోసం ప్రార్ధించాలని ఆశిస్తున్నాను. మీ ప్రార్ధన మనవులు, అంశములు ఏమిటో మాకు తెలియచేయండి. మా కోసం, మన “సజీవ నిరీక్షణ” రేడియో పరిచర్య కోసం ప్రార్ధించండి. మన పరస్పర విశ్వాసము ఒకరి కోసం ఒకరము ప్రార్ధించడం ద్వారా బయలు పరచుకుందాం. కాబట్టి నా కోసం ప్రార్ధించమని కోరుతున్నాను.

మన పరస్పర విశ్వాసము సహవాసము ద్వారా అనుభవిస్తున్నాము. ఇది నా కెంతో ఇష్టమయిన సంగతి. ఇది అద్భుతమైనది. ఆపో. పౌలు వారిని చూడాలని ఆశ పడుతున్నట్టు చెప్పాడు కదూ! “మీరు స్థిరపడవలేనని .. ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడను మిగుల అపేక్షించుచున్నాను.” (11 వ) ఆయన వారిని బలపరచి, స్థిరపరచాలని ఆశిస్తూ ఉన్నాడు, వారి చేత ఆయన కూడా బలపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన వారితో సహవాసము చేయాలని ఆశించాడు, వారి పరస్పర విశ్వాసము ఆ సహవాసములో తెలుస్తున్నది. వారి క్రైస్త జీవితం, విశ్వాసములో వారు వర్ధిల్ల డానికి, వారిని స్థిరపరచడానికి ఒక కృపావరం వారికి ఇవ్వాలని ఆశించాడు.

ఆ తరువాత ఆదరణ కోసం ఆరాటపడ్డాడు. 12 వ వచనంలో “మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలేనని” ఆశపడుతున్నట్టు తెలియచేస్తున్నాడు. పౌలు వారితో ఉండి, ఆదరణ ఒకరినుండి మరొకరు పొందాలని, ఆలాటి ఫలము పొందాలని ఆశించాడు.

అవును గదా! మన పరస్పర విశ్వాసము సహవాసములో అనుభవిస్తాము. విశ్వాసము ఇతర విశ్వాసులతో ఉండాలని, వారి సహవాసములో ఉండాలని, కలిసి ప్రభువును ఆరాధించాలని కోరుకుంటుంది. విశ్వాసము ఇతరులను బలపరుస్తుంది, కృపావరము ఇవ్వాలని కోరుకుంటుంది, ఇతరులు విశ్వాసములో బలంగా ఉండాలని కోరుకుంటుంది. ఇతరులను బలపర్చి స్థిరపర్చాలని కోరుకుంటుంది. అవును, క్రైస్తవులముగా మనము పరస్పర విశ్వాసమును బట్టి ఒకరితో ఒకరము సహవాసములో సంతోషిస్తామనేది ఎంత ఆదరణ కలిగించే సత్యం కదూ!

మనము సహవాసములో ఉండడానికి మీతో కలవాలని నేను ఎంతో ఆశించాను. పౌలు వారిని చూడాలని ఎంతో ఆశించానని చెప్పాడు. మనందరము ఒక్కసారి ఒక చోట కలిసి సహవాసము చేస్తే ఎంత బాగుంటుందో అని నేను ఆశించాను. మనము మహిమ లో ప్రవేశించినప్పుడు అది తప్పని సరిగా జరగనుంది. అప్పుడు మనకు మంచి, దగ్గరి సహవాసము, మహిమాలోని సహవాసము నిత్యసహవాసము ఉంటుంది. మన పరస్పర విశ్వాసము సహవాసములో బయలుపడుతుంది.

మన పరస్పర విశ్వాసము మన సాక్ష్యము ద్వారా మన ప్రార్ధనల ద్వారా, మన సహవాసము ద్వారా రుజువు కానుంది. నీవు క్రైస్తవుడవు అయితే, పౌలు ఏమి బోధిస్తున్నాడో నీకు అర్ధం అవుతుంది. నీవు క్రైస్తవుడవు కానట్లయితే, యేసు క్రీస్తు నందు విశ్వాసముంచమని నిన్ను ప్రేమతో ఆర్ధిస్తున్నాను, అప్పుడు నీవు కూడా పరస్పర విశ్వాసము యొక్క దీవెనలు అనుభవించ గలుగుతావు. అట్టి కృప ప్రభువు నీకనుగ్రహించు గాక!

ప్రార్ధన: నా జీవదాతా, పరలోకపు తండ్రీ, విశ్వాసము ఎంత బలమైనదో ఎంత శ్రేష్టమైనదో మీ వాక్యము ద్వారా తెలుసుకున్నాను. అది బహిర్గతమయ్యే సాక్ష్యము, ప్రార్ధన, సహవాసము ఎంత బలమైనవో తెలుసుకున్నాను. నా విశ్వాసమును గూర్చి ఇతరులతో సాక్ష్యామివ్వడానికి శక్తినివ్వండి, ఇతరులతో కలిసి పార్ధించడానికి ప్రేరణ కలిగించండి, సహవాసము చేయడానికి మార్గము తెరవండి. కరోన తెగులును బట్టి, మా సహవాసము పరిమితమైపోయింది. కృప చూపి, విశ్వాసము కలిగిన వారమందరము సహవాసము చేయడానికి మార్గము కలిగించమని మా రక్షకుడు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!